రేపు చిల్లా సరిహద్దు బ్లాక్‌ చేస్తాం: రైతులు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. దిల్లీ- నోయిడా మధ్య ఉన్న చిల్లా.........

Published : 15 Dec 2020 21:20 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. దిల్లీ- నోయిడా మధ్య ఉన్న చిల్లా సరిహద్దును రేపు పూర్తిగా బ్లాక్‌ చేస్తామని ప్రకటించారు. మంగళవారం మీడియా సమావేశంలో రైతు నేత జగ్జీత్‌ డాల్లేవాల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తాము అడుగుతుంటే.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదన్నారు. చర్చల నుంచి తాము ఎక్కడికీ పారిపోవడంలేదని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. 

ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు ఈనెల 20న నివాళులర్పించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో అమరులైన అన్నదాతలకు డిసెంబర్‌ 20న ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు దేశ వ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..

సరిహద్దుల్లో 60 వేల మంది రైతులు

రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి: మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని