ఐసీయూలో మంటలు..13మంది మృతి

మహారాష్ట్రలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్‌ జిల్లా వాసాయిలోని ఆస్పత్రి ఐసీయూలో మంటలు

Updated : 23 Apr 2021 12:14 IST

పాల్ఘర్‌: మహారాష్ట్రలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొన్నటికి మొన్న నాసిక్‌లోని ఓ కొవిడ్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీకై.. ప్రాణవాయువు సరఫరా నిలిచి 24 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన మరవకముందే పాల్ఘర్‌ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో ఐసీయూలో మంటలు చెలరేగి 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. వీరిలో 10 మంది మహిళలున్నారు. ఘటన నేపథ్యంలో ఇతర రోగులకు వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు.

ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. 

మోదీ సంతాపం

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన తీవ్ర బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు’అని మోదీ ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని