జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన డీడీసీ పోలింగ్‌

జమ్మూ-కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయతీ ఉపఎన్నికలకు నేటి నుంచి పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనునున్నాయి.........

Published : 28 Nov 2020 10:01 IST

అధికరణ 370 రద్దు తర్వాత తొలి ఎన్నికలు

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయతీ ఉపఎన్నికలకు నేటి నుంచి పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనునున్నాయి. దాదాపు ఏడు లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అధికరణ 370 రద్దు-జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడి కీలక ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా మరికొన్ని సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన గుప్‌కార్‌ కూటమి, భాజపా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

మరిన్ని కీలకాంశాలు..

* ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేడు తొలి దశ కాగా.. చివరి విడత డిసెంబరు 19న జరగనుంది. ఫలితాలు డిసెంబరు 22న వెలువడనున్నాయి. 

* మొత్తం 1427 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3.27 లక్షలు కశ్మీర్‌, 3.28 లక్షల మంది జమ్మూ డివిజన్‌కు చెందినవారు.

* మొత్తం 2,146 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

* తొలి విడతలో 296 మంది బరిలో ఉన్నారు. వీరిలో 207 మంది పురుషులు కాగా.. 89 మంది మహిళలు.

* మొత్తం 280 డీడీసీ స్థానాలున్నాయి. తొలి విడతలో 43 సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది. 

* ఇక పలు ప్రాంతాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 280 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

* భద్రత కోసం 145 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని