నేపాల్ పర్యటనలో విదేశాంగ కార్యదర్శి..

భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నేపాల్‌ చేరుకున్నారు.  ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ప్రాంతాల ద్వైపాక్షిక సహకారం గురించి ఆయన ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.  ఆ దేశ విదేశాంగ కార్యదర్శి భరత్‌ రాజ్‌ పౌడ్యాల్‌ ఆహ్వానం మేరకు హర్ష వర్ధన్‌ తొలిసారి నేపాల్‌ను సందర్శించారు.

Published : 26 Nov 2020 23:31 IST

కాఠ్‌మాండూ: భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నేపాల్‌ చేరుకున్నారు.  ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ప్రాంతాల ద్వైపాక్షిక సహకారం గురించి ఆయన ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.  ఆ దేశ విదేశాంగ కార్యదర్శి భరత్‌ రాజ్‌ పౌడ్యాల్‌ ఆహ్వానం మేరకు హర్షవర్ధన్‌ తొలిసారి నేపాల్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా హర్షవర్ధన్‌  విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్‌ గ్యావాలి,  ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, ఆ దేశ ప్రెసిడెంట్‌ విద్యాదేవి భండారీలతో సమావేశం కానున్నారు.  భారత్‌ సహకారంతో గోర్ఖాలో నిర్మించిన మూడు పాఠశాలలను శుక్రవారం సందర్శించనున్నారు. అనంతరం కొవిడ్‌-19 సంబంధిత సహకారం గురించి నేపాల్‌ ప్రభుత్వంతో చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని