జమ్మూకశ్మీర్‌లో నలుగురు ముష్కరుల హతం

జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుపెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని...

Published : 19 Nov 2020 11:10 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుపెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

జమ్మూ నుంచి శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ట్రక్కును గురువారం తెల్లవారుజామున నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద తనిఖీ నిమిత్తం ఆపగా.. అందులోని ముష్కరులు ఆటోమెటిక్ ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ము ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్ పోలీస్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ ఘటనలో గాయపడ్డ ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఉదయం జరిగిన ఘటనతో బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఈ ఏడాదిలో ఈ తరహాలో జరిగిన రెండో ఆపరేషన్ ఇది. జనవరి 31న కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని