Published : 26/04/2020 15:03 IST

క్వారంటైన్‌కు 14 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన 14 మందిని క్వారంటైన్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల వీరంతా ఆగ్రాలో పోలీసులకు సాయంగా 20 రోజుల పాటు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో అక్కడ ఒక ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. అక్కడి వంటగదిలో పనిచేసిన ఓ వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. శనివారం సాయంత్రమే వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌ పట్టణానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వెంటనే వీరి నమూనాలను సేకరించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిలో ఎవరికీ కొవిడ్‌-19 లక్షణాలు లేవని వెల్లడించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఏరివేత ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి భారత సైన్యంలో విజృంభించకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు భారత నేవీలో 25 మందికి, ఆర్మీలో ఎనిమిది మందికి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.

ఇవీ చదవండి..

మే 3 తర్వాత స్వదేశానికి భారతీయులు?

ప్రతి భారతీయుడు సైనికుడే: మోదీ

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని