ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్నెట్‌ ఉచితం 

ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Published : 09 Nov 2020 23:12 IST

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం

హరిద్వార్‌: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ దోయివాలా పట్టణంలోని షహీద్‌ దుర్గామల్‌ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న డిజిటల్‌ ఇండియా సాధన దిశగా ఈ చర్యను ఆయన అభివర్ణించారు.

అన్ని ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అత్యంత వేగవంతమైన, ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచినందుకు ఆయన అభినందనలు తెలిపారు. కాగా, ఈ ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం రాష్ట్ర విద్యావిధానంలో మంచి ఒరవడికి నాంది కాగలదని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని