క్షమించండి.. నేనప్పుడు ‘అలా’ లేను!

భారతీయుల మనోభావాలను గాయపరచినట్లయితే క్షమించాలని ఆమె కోరారు. అయితే..

Published : 01 Sep 2020 01:27 IST

రిషీకేశ్‌ ఉదంతంపై ఫ్రెంచి మహిళ స్పందన

రిషీకేశ్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ హిందువుల పుణ్యక్షేత్రం రిషీకేశ్‌లో అభ్యంతరకరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఫ్రెంచి మహిళ మేరీ హెలెన్‌ గురువారం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. భారతీయుల మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమించాలని ఆమె కోరారు.. అయితే ఆ సమయంలో తాను నగ్నంగా లేనని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను గురించి సమాజంలో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో తాను ఈ విధంగా చేశానని హెలెన్‌ వివరించారు.

ఇక్కడ గంగానదిపై ఉన్న సుమారు వంద సంవత్సరాల నాటి వంతెన లక్ష్మణ్‌ ఝూలాపై నగ్నంగా వీడియోలు తీసి, వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచినందుకు.. ఇంటర్నెట్‌ చట్టాల ప్రకారం 27 ఏళ్ల ఈ యువతిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే తాను ఈ వీడియో తీస్తుండగా చుట్టుపక్కల ఎవరూ లేరని..  దేశంలో లైంగిక దాడులను గురించి అవగాహన తీసుకొచ్చేందుకు మాత్రమే ఈ విధంగా చేశానని మేరీ హెలెన్‌ అంటున్నారు. కాగా, తను పూసలతో చేసిన గొలుసులు అమ్ముతానని, తన వ్యాపారానికి ప్రచారం కోసమే ఈ విధంగా చేశానని ఆ ఫ్రెంచి మహిళ తొలుత అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. విచారణ కోసం ఫ్రెంచి యువతి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని... అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేసినట్టు వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని