ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి అన్ని రకాల ఉల్లిపాయలను........

Published : 28 Dec 2020 20:42 IST

దిల్లీ: ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి అన్ని రకాల ఉల్లిపాయలను స్వేచ్ఛగా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని, ఎలాంటి నిషేధం ఉండదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. బెంగళూరు రోజ్‌, కృష్ణాపురం ఉల్లి రకాలను కూడా ఎగుమతి చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కేంద్రం కొత్త సంవత్సరం రోజు నుంచే ఉల్లి ఎగుమతులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇదీ చదవండి..

ధర్మరాజును జూదంవైపు నడిపించింది ఏది?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని