కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐదేళ్లు

కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోవాలంటే ఐదేళ్ల సమయం పట్టొచ్చని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్‌ రీన్‌హర్ట్‌ అన్నారు. గురువారం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

Published : 17 Sep 2020 19:07 IST

మాడ్రిడ్‌: కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోవాలంటే ఐదేళ్ల సమయం పట్టొచ్చని ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్‌ రీన్‌హర్ట్‌ అన్నారు. గురువారం స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో పేదరికం శాతం పెరిగిందని అన్నారు. కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయని ఆమె సమావేశంలో వెల్లడించారు. 

‘కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా వెంటనే ఆర్థిక వ్యవస్థలు కొంత మేర పుంజుకోవచ్చు. కానీ, పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పురోగతి సాధించాలంటే మాత్రం ఐదేళ్ల సమయం పడుతుంది. కొవిడ్‌-19 వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యం ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే కొన్ని దేశాల్లో ఇంకా కొంత కాలం ఎక్కువ ఉంటుంది. ధనిక దేశాల కంటే పేద దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అంతేకాకుండా అసమానతలు కూడా పెరుగుతాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ పేదరికం స్థాయి పెరిగింది’అని రీన్‌హార్ట్‌ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని