చైనా యాప్‌లపై నిషేధం.. కేంద్రం హెచ్చరికలు

చైనాకు చెందిన 59 యాప్‌ల నిషేధాజ్ఞలను దేశంలో కచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడితే..

Published : 21 Jul 2020 23:14 IST

దిల్లీ: చైనాకు చెందిన 59 యాప్‌లపై విధించిన నిషేధాజ్ఞలను కచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంగళవారం ఆయా సంస్థలను హెచ్చరించింది. నిషేధించిన యాప్‌ల లభ్యత, వినియోగం చట్టవిరుద్ధమని, సమాచార సాంకేతిక చట్టం ప్రకారం జరిమానాకు అర్హులని ఆయా సంస్థలకు తెలిపింది. యాప్‌లపై నిషేధం దేశ సార్వభౌమాధికారంతో ముడిపడి ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులు కచ్చితత్వంతో పాటించాలని స్పష్టం చేసింది. నిషేధిత జాబితాలోని యాప్‌లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ దేశంలో అందుబాటులో ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా సంస్థలన్నీ మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించాలని వెల్లడించారు. భారత్‌- చైనా సరిహద్దులో గల్వాన్‌ లోయ వద్ద భారత సైనికులపై చైనా సైన్యం దాడిని నిరసిస్తూ జూన్‌ 29న చైనాకు చెందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 యాప్‌లను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని