Updated : 27/12/2020 18:32 IST

డ్రైవింగ్‌ లైసెన్స్‌ల వ్యాలిడిటీ గడువు పెంపు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల ధ్రువపత్రాల వ్యాలీడిటీ గడువును పెంచుతూ నిర్ణయించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ పత్రం, పర్మిట్ పత్రాల వ్యాలిడిటీ గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

‘వాహనాల ధ్రువపత్రాలు డీఎల్‌, ఆర్సీ, పర్మిట్స్‌ వ్యాలిడిటీ గడువును మార్చి 31, 2021 వరకు పెంచుతూ నిర్ణయించాం. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రోడ్డు రవాణా శాఖ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 1 నాటికి గడువు ముగిసే ధ్రువపత్రాలపై ఈ నిర్ణయం వర్తించనుందని.. ఈ సూచనను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది. 

ఇదీ చదవండి

ధోనీ, కోహ్లీనే ఈ దశాబ్దపు సారథులు

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని