ఆరు రబీ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం!

రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమపై కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల

Updated : 22 Sep 2020 18:26 IST

దిల్లీ: రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో వెల్లడించారు. తోమర్‌ మాట్లాడుతూ.. 'మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు సీసీఈఏ ఆమోదించింది. అందులో భాగంగా గోధుమపై ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.50 పెంచుతూ.. ధరను రూ.1,975 గా నిర్ణయించింది. అదేవిధంగా మసూర్‌ పప్పుపై రూ.300 పెంచి క్వింటా ధర రూ.5,100గా, ఆవాలపై రూ.225 పెంచి క్వింటాకు ధర రూ.4,650గా, సన్‌ఫ్లవర్‌పై రూ.112 పెంచి క్వింటా ధర రూ.5,327గా, శనగపై క్వింటాకు రూ.250, బార్లీపై రూ.75 ఎంఎస్‌పీ పెంచేందుకు ఆమోదించింది. ఎంఎస్‌పీ, మార్కెట్‌ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు' అని ఆయన విమర్శించారు. కనీస మద్దతు ధరపై తోమర్‌ చేసిన ప్రకటనతో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు సభలో నుంచి వెళ్లిపోయారు. 

రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి రెండు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా ఒకవైపు ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతుండగా.. మరోవైపు కేంద్రం ఎంఎస్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని