ట్విటర్‌కు కేంద్రం నోటీసులు!

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో చూపింనందుకు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ .........

Published : 13 Nov 2020 01:10 IST

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో చూపినందుకు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ ఈ నెల 9న  నోటీసులు ఇచ్చింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో చూపడానికి బదులుగా కశ్మీర్‌లో చూపడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలా తప్పుగా ఎందుకు చూపారో ఐదు పని దినాల లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా, దానికి రాజధానిగా లేహ్‌ను ప్రకటించిన భారత పార్లమెంట్‌ సంకల్పాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా ఈ చర్య ఉందని పేర్కొంటూ ఆ సంస్థ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు నోటీసులు పంపింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచేలా మ్యాప్‌ను చూపినందుకు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో ట్విటర్‌, ఆ సంస్థ ప్రతినిధులు సమాధానం చెప్పాలని పేర్కొంది.

ఒకవేళ ఈ నోటీసులపై ట్విటర్‌ స్పందించకపోయినా, సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా ఐటీ చట్టం ప్రకారం దేశంలో ట్విటర్‌ను బ్లాక్‌ చేయడం లేదా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కూడా లేహ్‌ను చైనాలో భాగంగా చూపడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని