ఉగ్రవాదుల నుంచి విద్యార్థులకు విముక్తి

నైజీరియా దేశం కట్సిన రాష్ట్రంలోని ఓ పాఠశాలలోని కిడ్నాప్‌కు గురైన 300లకు పైగా చిన్నారులను సురక్షితంగా కాపాడినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ అమినో బిల్లో మసారి వెల్లడించారు....

Updated : 19 Dec 2020 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైజీరియాలోని కట్సిన రాష్ట్రంలో ఓ పాఠశాలకు చెందిన అనేకమంది మంది విద్యార్థులు కిడ్నాప్‌కు గురవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ విద్యార్థుల్లో 300లకు పైగా చిన్నారులను సురక్షితంగా కాపాడినట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ అమినో బిల్లో మసారి వెల్లడించారు. అపహరణకు గురైన వారిలో 344 మందిని భద్రతా దళాలు రక్షించినట్లు ఆయన తెలిపారు. మిగిలినవారిని సైతం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కట్సినలోని 800 మంది విద్యార్థులున్న ఓ పాఠశాలపై గతవారం సాయుధులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో పాఠశాలలోని చాలా మంది విద్యార్థులు తప్పించుకోగా 350కి పైగా విద్యార్థులను దుండగులు బంధించారు. బోకోహారమ్‌ ఉగ్రవాదులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. సురక్షితంగా కాపాడిన విద్యార్థులను వారి కుటుంబాల వద్దకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు గవర్నర్‌ అమినో బిల్లో తెలిపారు.

ఇవీ చదవండి...

గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి

కోట్ల హృదయాలు గెలిచి కొవిడ్‌ ముందు ఓడారు
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని