గుజరాత్‌లో నవరాత్రి వేడుకలు రద్దు..

దసరా నవరాత్రి ఉత్సవాలపై గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం లేదని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వెల్లడించారు.  

Published : 27 Sep 2020 01:36 IST

గాంధీనగర్‌: దసరా నవరాత్రి ఉత్సవాలపై గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా‌ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం లేదని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వెల్లడించారు. వాస్తవానికి ఈ ఏడాది ఉత్సవాలు అక్టోబర్‌ 17 నుంచి 25 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ వైరస్‌ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే వ్యక్తిగతంగా గర్భా నృత్య వేడుకలు నిర్వహించుకోవాలా? లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది.

గుజరాత్‌లో ప్రభుత్వం ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోని జీఎండీసీ మైదానంలో మాత్రం ఏటా గర్బా నృత్యం సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ సంబరాలు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. గతేడాది జీఎండీసీ మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొని అమ్మవారికి హారతి ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని