Spying: పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన 

Published : 26 Oct 2021 12:48 IST

భుజ్‌: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సాజిద్‌.. పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్‌ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్‌ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్‌ గుర్తించింది. 2011, 2012 సంవత్సరాలలో సాజిద్‌ 46 రోజుల పాటు పాక్‌లో గడిపినట్టు అతని పాస్‌పోర్టు ద్వారా బయటపడింది. బీఎస్‌ఎఫ్‌లో నమోదైన సాజిద్‌ పుట్టిన రోజు కూడా తప్పేనని తేలింది. ఈ ఆధారాలు సేకరించిన ఏటీఎస్‌ పోలీసులు.. భుజ్‌లోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి రెండు ఫోన్లు, ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్న సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని