మంచి మిత్రుడితో మాట్లాడా.. హ్యాపీగా ఉంది: మోదీ 

ఖతార్‌ దేశాధినేత తమిమ్‌ బిన్‌ హమీద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఖతార్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు..........

Published : 08 Dec 2020 18:43 IST

దిల్లీ: ఖతార్‌ దేశాధినేత తమిమ్‌ బిన్‌ హమీద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఖతార్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు. మంచి మిత్రుడితో సంభాషణ ఎంతో ఆనందాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాలు అన్ని రంగాల్లో మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. భారత్‌కు ఇంధన సరఫరాలో ఖతార్‌ కీలక పాత్ర పోషిస్తోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లోనూ ఖతార్‌ది కీలక పాత్రేనని మోదీ తెలిపారు. ఈ నెల 18న ఖతార్‌ జాతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనతో మాట్లాడినట్టు పీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా హమీద్‌ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే, ఇంధన భద్రత, పెట్టుబడి రంగాల్లో సహకారంపై ఇరుదేశాధినేతల మధ్య చర్చ జరిగినట్టు పీఎంవో తెలిపింది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఈ చర్చల్లో నిర్ణయించినట్టు సమాచారం. కొవిడ్‌తో నెలకొన్న అనిశ్చితికి తెరపడి మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత వ్యక్తిగతంగా భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 

ఇదీ చదవండి

ఎవరెస్ట్‌ తాజా ఎత్తు ఎంతో తెలుసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని