దిల్లీ శివారులో ఆగిన మరో రైతన్న గుండె

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న మరో అన్నదాత గుండె ఆగిపోయింది. దేశ రాజధాని శివారులోని టిక్రి సరిహద్దులో ఈ ఉదయం హరియాణాకు చెందిన ఓ యువ రైతు

Updated : 08 Dec 2020 15:26 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేస్తున్న మరో అన్నదాత గుండె ఆగిపోయింది. దేశ రాజధాని శివారులోని టిక్రి సరిహద్దులో ఈ ఉదయం హరియాణాకు చెందిన ఓ యువ రైతు మృతిచెందారు. సోనెపట్‌కు చెందిన 32ఏళ్ల అజయ్‌ మూర్‌ గత కొన్ని రోజులుగా టిక్రి సరిహద్దుల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం అజయ్‌ విగతజీవిగా కన్పించడంతో తోటి రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోస్ట్‌మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

గత కొన్ని రోజులుగా అజయ్‌ రహదారిపైనే పడుకున్నారు. తీవ్రమైన చలి కారణంగానే అతడు మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అజయ్‌ మరణంపై కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా.. గతవారం ఇదే టిక్రి సరిహద్దులో పంజాబ్‌కు చెందిన ఓ 57ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందారు. దిల్లీలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. అత్యంత కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినా ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా గత 12 రోజులుగా అన్నదాతలు హస్తిన శివారుల్లో ఆందోళన సాగిస్తున్నారు. ట్రాక్టర్లనే గుడారాలుగా మలుచుకుని.. రోడ్డుపైనే వంట చేసుకుంటూ నిరసన చేస్తున్నారు. 

మరోవైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు నేడు భారత్‌ బంద్‌ చేపట్టాయి. వీరికి పలు రాజకీయ పార్టీలకు, కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. పలు చోట్ల నిరసనలు, రాస్తారోకోలు జరిగాయి. 

ఇవీ చదవండి..

మోదీజీ.. రైతులను దోచుకోవడం ఆపండి

రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని