మా వివాహం అప్పుడే: న్యూజిలాండ్‌ ప్రధాని

మా వివాహానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకున్నాకే పెళ్లి చేసుకుంటామని  న్యూజిలాండ్‌కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు...

Published : 12 Nov 2020 01:29 IST

వెల్లింగ్టన్‌: మా వివాహానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకున్నాకే పెళ్లి చేసుకుంటామని  న్యూజిలాండ్‌కు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండా ఆర్డెర్న్‌ పేర్కొన్నారు. తమ వివాహానికి మరికొంత సమయం పట్టొచ్చన్నారు. న్యూ ప్లైమౌత్‌ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో విలేకరి అడిగిన ప్రశ్నకు జెసిండా సమాధానమిచ్చారు. ‘మాకు కొన్ని ప్లాన్స్‌ ఉన్నాయి. వాటిని కుటుంబసభ్యులు, మిత్రులతో పంచుకోవాలి. అవి నెరవేరేందుకు మరికొంత సమయం పట్టొచ్చు’ అని వెల్లడించారు. 

జెసిండా ఆర్డెర్న్‌ (40)కు, టీవీ వ్యాఖ్యాత క్లార్క్‌ గేఫోర్డ్‌ (44)కు గతంలోనే నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం ఆ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. న్యూజిలాండ్‌లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెసిండా అధ్యక్షత వహిస్తున్న లేబర్‌ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది. దీంతో జెసిండా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. పార్టీ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా మెజారిటీ సాధించి మొట్టమొదటిసారి మరే ఇతర పార్టీతో పొత్తు కలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని