అతనిని పశువు అనే పిలుస్తాను.. ట్రంప్‌

అతను మనిషి అని ఎవరైనా అనవచ్చు. కానీ కాదు.. అతను పశువుతో సమానం. అతనిని నేను పశువు అనే పిలుస్తాను.

Published : 14 Sep 2020 13:08 IST

పోలీసులను చంపితే మరణశిక్షే

కాంప్టన్: పోలీసు అధికారులను చంపిన వారికి మరణశిక్ష విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. లాస్‌ఏంజిల్స్‌, కాంప్టన్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుమారు ఆదివారం నెవాడాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తుపాకీ ధరించిన ఓ గుర్తుతెలియని దుండగుడు పోలీసు వాహనంపై కాల్పులు జరిపాడు. అకారణంగా అతను ఈ దుర్మార్గానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనపై ట్రంప్‌ స్పందిస్తూ ‘‘వాహనం వద్దకు వెళ్లిన దుండగుడు పోలీసులపై దాడి చేశాడు. వారి పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా ఉంది. అతను మనిషి అని ఎవరైనా అనవచ్చు. కానీ కాదు.. అతను పశువుతో సమానం. అతన్ని నేను పశువు అనే పిలుస్తాను’’ అని వెల్లడించారు.

ఈ దాడిలో 24 ఏళ్ల అధికారి, 31 ఏళ్ల మహిళా అధికారి తీవ్రంగా గాయపడ్డారు. వారికి వైద్యులు ఆదివారం సాయంత్రం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. వీరు గత సంవత్సరమే విధుల్లో చేరినట్టు తెలిసింది. కాగా, పరారీలో ఉన్న నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల బహుమానం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని