26/11 దాడి సూత్రధారిపై అమెరికా భారీ రివార్డు

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ మీర్‌ తలపై అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. మారణహోమం జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.........

Updated : 28 Nov 2020 12:33 IST

ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ మీర్‌ తలపై అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. మారణహోమం జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఐదు మిలియన్‌ డాలర్లు అందజేస్తామని తెలిపింది. ముంబయి పేలుళ్లలో పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన సాజిద్‌ మీర్‌దే ప్రధాన పాత్ర అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు 2011లో అమెరికాలోని ఓ డిస్ట్రిక్ట్‌ కోర్టు అతణ్ని దోషిగా తేల్చిందని గుర్తుచేసింది. ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాదుల జాబితాలోనూ మీర్‌ ఉన్నాడని తెలిపింది. 

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బాంబు పేలుళ్లు జరిగి ఈ ఏడాదికి 12 ఏళ్లు. లష్కరే తోయిబా ఉగ్రమూకలు ముంబయి నగరంలో 12 చోట్ల నరమేధం సృష్టించారు. దాదాపు 60 గంటలపాటు జరిగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముంబయికి చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా అమరులయ్యారు. వందల సంఖ్యలో సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బందిని అక్కడే మట్టుబెట్టగా, మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను 2012లో ఉరితీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని