శశికళకు ఐటీ శాఖ భారీ షాక్‌!

జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. రూ.2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధ చట్టం ప్రకారం అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. కొడనాడ్‌, సిరతవూర్‌లో ..........

Published : 07 Oct 2020 17:38 IST

రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. రూ.2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. కొడనాడ్‌, సిరతవూర్‌లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్‌ పేరిట ఉన్న ఆస్తులను సీజ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో బయట ఐటీ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. ‘‘మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన ఆస్తులను ఈ రోజు ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. తమిళనాడులోని కొడనాడు, సిరతవూర్‌లలోని రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది’’ అని నోటీసుల్లో పేర్కొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని