Published : 14/08/2020 02:09 IST

వైరల్ అవుతున్న టీఎంసీ కార్యకర్త తెగువ

కోల్‌కతా: కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు..కళ్లెదుట మనుషులు చనిపోతున్నా..కన్నవారు, కట్టుకున్న వారు మహమ్మారి కాటుకు బలవుతున్నా.. పట్టనట్టు వ్యవహరిస్తున్న రోజులివి. పక్కవారు దగ్గినా, తుమ్మినా కరోనా అనే భయంతో మనిషిని మనిషే వైరస్‌లా చూసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) యువ నాయకుడు చూపిన తెగువ సర్వత్రా చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్లో జార్‌గ్రామ్‌ జిల్లా గోపిబల్ల్వాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం అమల్ బారిక్‌ అనే వలస కూలీ ఝార్ఖండ్‌లోని తన స్వగ్రామం నుంచి రోజువారీ కూలీగా పనిచేసేందుకు ఈ నెల మొదట్లో గోపిబల్ల్వాపూర్‌కు వచ్చాడు. అయితే అతడు కొద్ది రోజులుగా జ్వరం బాధపడుతున్నాడు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి వెళ్లేందుకు చుట్టుపక్కలవారి సాయం కోరాడు. కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీఎంసీ యువజన విభాగం నాయకుడు సత్యకామ్‌ పట్నాయక్‌ అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ముందుగా పట్నాయక్‌ స్థానికంగా ఉన్న మందుల దుకాణానికి వెళ్లి పీపీఈ కిట్ కొనుగోలు చేసి, దానిని ధరించి బారిక్‌ను బైక్‌పై వెనక కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడితో ఆగకుండా డాక్టరు వచ్చేంత వరకు ఉండి, బారిక్‌కు పరీక్షలు చేయించి తిరిగి అతణ్ని ఇంటి దగ్గర విడిచిపెట్టాడు. అలా బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీని గురించి పట్నాయక్‌ మాట్లాడుతూ‘‘ బారిక్‌ గురించి తెలిసి, ఊరికే ఉండలేకపోయాను. అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కరోనా రోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారు. అది మంచిది కాదు’’ అని అన్నాడు. పట్నాయక్ చేసిన పనికి నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని