అందుకే భారత్‌తో నిరంతరం వివాదాలు! 

భారత్‌-చైనా సరిహద్దుల్ని ఇప్పటి వరకు కచ్చితంగా నిర్ణయించలేదని.. అందువల్లే వివాదాలు తలెత్తుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అన్నారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.........

Updated : 01 Sep 2020 16:17 IST

సరిహద్దు ఘర్షణలపై చైనా విదేశాంగమంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

బీజింగ్‌: భారత్‌-చైనా సరిహద్దుల్ని కచ్చితంగా నిర్ణయించలేదని.. అందువల్ల ఎప్పటికీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు సరిహద్దుల్లో భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ మరోవైపు శాంతివచనాలు వల్లెవేయడం విడ్డూరంగా ఉంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద సైనిక కదలికల్ని పెంచుతూ భారత్‌తో ఘర్షణకు దిగిన రెండు రోజులకే చైనా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత్‌తో సంబంధాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తాజా వివాదాన్ని వాంగ్‌ యీ ప్రస్తావించకపోవడం గమనార్హం. భారత్‌-చైనా సంబంధాలపై ఇటీవల ప్రపంచ దేశాల దృష్టి మళ్లిందన్నారు. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు వివాదాల్ని సైతం చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దేశాలు అభివృద్ధి సాధిస్తే ప్రపంచంలో 270 కోట్ల మంది ఆధునికత వైపు అడుగు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ సామాజిక పరిస్థితిపై ఇది ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. 

ఇవీ చదవండి..

చైనా మళ్లీ... దుస్సాహసం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని