24 గంటల్లో 79,476 కేసులు.. 1,069 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 11,32,675 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64,73,545 కేసులు నిర్ధారణ అయ్యాయి............

Published : 03 Oct 2020 09:56 IST

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 11,32,675 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64,73,545 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 54,27,707 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. మరో 9,44,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా 1,069 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 1,00,842కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 75,628 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.84 శాతంగా, మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని