పుల్వామాదాడి మా విజయం: పాక్‌

పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ చౌదరీ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు.

Updated : 29 Oct 2020 18:45 IST

దిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. ‘భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది. మనమంతా ఆ విజయంలో భాగస్వాములం’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ వ్యవహారంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా వణికినట్లు ఆ దేశ ప్రతిపక్ష ఎంపీ అయాజ్‌ సాధిక్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనను సమర్థించుకుంటూ ఫవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. 

పుల్వామా ఘటన అనంతర పరిణామాల్లో భారత వైమానిక వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ సైన్యానికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన విడుదల వ్యవహారంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా, విదేశాంగ మంత్రి ఖురేషీకి మధ్య జరిగిన సంభాషణను పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌)నేత అయాజ్‌ సాధిక్‌ పార్లమెంటులో వెల్లడించారు. వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని ఖురేషీ చెప్పినట్లు.. ఆ సమయంలో బజ్వా కాళ్లు వణికినట్లు అయాజ్‌ వెల్లడించారు. దీంతో అయాజ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అమరులు అయ్యారు. 

పాక్‌ ఆర్మీ జనరల్‌ వణికిన వేళ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని