ఎల్‌ఏసీపై చైనా వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్‌!

భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవాధీనరేఖ(ఎల్‌ఏసీ)ను చైనా ఏకపక్షంగా నిర్వచించడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా 1959లో ఏకపక్షంగా ప్రతిపాదించిన ఎల్‌ఏసీని తాము ఎప్పటికీ అంగీకరించమని...........

Published : 30 Sep 2020 01:37 IST

దిల్లీ: భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవాధీనరేఖ(ఎల్‌ఏసీ)ను చైనా ఏకపక్షంగా నిర్వచించడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా 1959లో ఏకపక్షంగా ప్రతిపాదించిన ఎల్‌ఏసీని తాము ఎప్పటికీ అంగీకరించమని భారత విదేశాంగ శాఖ పొరుగు దేశానికి గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. ‘చైనా 1959లో ఎల్‌ఏసీపై ఏకపక్షంగా చేసిన ప్రతిపాదనలను భారత్‌ ఎప్పటికీ అంగీకరించదు. అప్పటి ఏకపక్ష ప్రతిపాదనలకు చైనా కట్టుబడి ఉన్నట్లు తాజాగా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి పేర్కొనడం సరికాదు. ఆయన వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తుంది. సరిహద్దు విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని చైనా తగ్గించాలి. ఒకే ఎల్‌ఏసీ ఉందని చైనా పట్టుబట్టడం ఇరు దేశాల కట్టుబాట్లకు విరుద్ధం’ అని శ్రీవాస్తవ తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఆయన భారత్‌, చైనా మధ్య 1993, 1996, 2005లో జరిగిన పలు ద్వైపాక్షిక ఒప్పందాలను గుర్తుచేశారు. ఇటీవల చైనా విదేశాంగ ప్రతినిధి ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌ఏసీ విషయంలో చైనా 1959లో అప్పటి భారత ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూకు చేసిన ప్రతిపాదనలకు కట్టుబడి ఉందని అన్నారు. కాగా వాస్తవాధీన రేఖ విషయంలో భారత్‌, చైనా మధ్య గత కొద్ది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని