42,298 రికవరీలు.. 41,810 కొత్త కేసులు

దేశంలో కరోనా కొత్త కేసుల కంటే కోలుకొని ఇంటికెళ్తున్న వారి సంఖ్య పెరిగే పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 42,298 మంది కోలుకోగా.......

Updated : 29 Nov 2020 13:46 IST

దిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల కంటే కోలుకొని ఇంటికెళ్తున్న వారి సంఖ్య పెరిగే పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 42,298 మంది కోలుకోగా.. 41,810 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 93,92,920కి చేరింది. నిన్న ఒక్కరోజే 496 మంది మరణించారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,53,956 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 88,02,267 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 1,36,696 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 12,83,449 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం 4.83శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 93.71 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.46శాతంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని