94 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నప్పటికీ, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

Updated : 02 Dec 2020 12:19 IST

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నప్పటికీ, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..మంగళవారం 36,604 కొత్త కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే 17.6శాతం పెరుగుదల కనిపించింది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94,99,413మంది వైరస్ బారినపడ్డారు. అయితే, కొత్త పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. నిన్న 43,062మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకోగా..ఆ సంఖ్య మొత్తంగా 89,32,647(94.03శాతం)గా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 4,28,644గా ఉండగా..ఆ రేటు 4.51శాతానికి తగ్గింది. ఇక, ఈ వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో 501మంది ప్రాణాలు కోల్పోగా..ఈ మహమ్మారికి 1,38,122మంది బలయ్యారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం..నిన్న 10,96,651 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

10రోజులకు పైగా 50 వేలకు దిగువనే..
ఇదిలా ఉండగా..దేశంలో కరోనా వైరస్ కేసులు పది రోజులకు పైగా 50 వేలకు దిగువనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. నవంబర్ 21 నుంచి వెలుగులోకి వచ్చిన కొత్త కేసులు, నిర్ధారణ పరీక్షల సంఖ్యను గ్రాఫ్ రూపంలో వివరిస్తూ..ట్వీట్ చేసింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని