వరుసగా ఏడో రోజు 40 వేలకు దిగువన..

దేశంలో కరోనా కొత్త కేసుల తగ్గుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 36,011 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది............

Published : 06 Dec 2020 10:07 IST

దిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల తగ్గుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 36,011 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 96,92,920కి చేరింది. గత వారం రోజులుగా కొత్త కేసులు 40 వేల కంటే దిగువన నమోదు అవుతుండడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 482 మంది మరణించారు. 4,03,248 క్రియాశీల కేసులు ఉండగా.. ఇప్పటివరకు 91,00,792 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. నిన్న ఒక్కరోజే 41,970 మంది కోలుకొని ఇంటికి చేరారు. కరోనాతో ఇప్పటి వరకు 1,40,182 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 11,01,063 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4.18 శాతానికి తగ్గాయి. అలాగే రికవరీ రేటు 94.37 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.45శాతంగా ఉంది.

ఇవీ చదవండి..
బ్రిటన్‌ రాణికి కొవిడ్‌ వ్యాక్సిన్‌!

తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని