ఐదు రోజులుగా 500లోపే మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత 11 రోజులుగా రోజూవారీ పాజిటివ్ కేసులు మాత్రం 40 వేలకు దిగువనే నమోదవుతున్నాయి.

Published : 10 Dec 2020 10:14 IST

24 గంటల్లో 31,521 కొత్త కేసులు..412 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే, గత 11 రోజులుగా రోజూవారీ పాజిటివ్ కేసులు మాత్రం 40 వేలకు దిగువనే నమోదవుతున్నాయి.  తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం 9,22,959 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..31,521 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,371 కి చేరింది. మరోవైపు క్రియాశీల కేసుల సంఖ్యలో తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 3,72,293గా ఉండగా.. పాజిటివిటీ రేటు 3.81 శాతానికి తగ్గింది. ఇక నిన్న 37,725 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 92,53,306(94.74 శాతం)గా ఉంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో 412 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. దాంతో మరణాల సంఖ్య 1,41,772కు చేరుకుంది. 

దేశ రాజధానికి ఊరట 
దేశ రాజధాని దిల్లీలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బుధవారం కొవిడ్ కారణంగా 50 మంది మరణించగా.. నవంబర్‌ ఒకటి తరవాత ఇదే అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం. కరోనా వైరస్‌పై జరిపే పోరాటంలో దేశ రాజధాని విజయవంతమవుతోందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ నిన్న 2,463 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. 

15 కోట్లు దాటిన నిర్ధారణ పరీక్షలు..
దేశంలో ఇప్పటివరకు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 15 కోట్ల మార్కును దాటేసింది. డిసెంబర్ 10 నాటికి 15,07,59,726 నమూనాలను పరీక్షించారు. నిన్న ఒక్కరోజే 9,22,959 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  

ఇవీ చదవండి:

ఫేస్ షీల్డ్ పెట్టుకొని..మాస్క్‌ ధరించకుంటే..

కరోనానా..? ఆ ఊసే లేదక్కడ!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని