కరోనా వేళ..చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ స్వైన్‌ఫ్లూ వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) నివేదిక ప్రకారం దేశంలో ఈ సంవత్సరం (జులై31వరకు) 2721 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు ఎన్‌సీడీసీ నివేదించింది.

Published : 18 Aug 2020 18:27 IST

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ స్వైన్‌ఫ్లూ వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) నివేదిక ప్రకారం దేశంలో ఈ సంవత్సరం (జులై31వరకు) 2721 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు ఎన్‌సీడీసీ నివేదించింది. మరో 44 మంది ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. స్వైన్‌ఫ్లూ కేసులు అత్యధికంగా కర్ణాటకలో(458) నమోదు కాగా తెలంగాణ(443), దిల్లీ(412), తమిళనాడు(253) ఉత్తర్‌ప్రదేశ్‌(252) రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కూడా తుమ్ము, దగ్గు ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీలు, ఐదు సంవత్సరాలలోపు వయసుగల చిన్నారులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వయసుపైబడిన వారిపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే కరోనా వైరస్‌, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేవిధంగా ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో లక్షణాలున్న వారికి వైద్యులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షతో పాటు ఇన్‌ఫ్లుయంజా పరీక్షలు కూడా నిర్వహించాలని సూచిస్తున్నారు. వీటి బారినపడకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని శ్వాసకోస నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని