74ఏళ్ల పురోగతి ప్రతిబింబిస్తోంది..కమలా హారిస్‌

అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ నాయకురాలు కమలా హారిస్‌ భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన దశాబ్దాల్లో భారత్‌ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు.

Published : 16 Aug 2020 14:10 IST

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హారిస్‌

దిల్లీ: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్‌ నాయకురాలు కమలా హారిస్‌ భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన దశాబ్దాల్లో భారత్‌ సాధించిన పురోగతి ప్రస్తుతం ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు. ‘న్యాయం కోసం చేసిన పోరాటంలో మన ప్రజలు చెప్పుకోదగిన పురోగతి సాధించారు. గత 74 సంవత్సరాల పురోగతి ప్రతిబింబిస్తోంది. మరింత మంచి భవిష్యత్తును నిర్మించడానికి మనమందరం కట్టుబడి ఉందాం. ఈ సమయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది’ అని కమలా హారిస్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడి బరిలో ఉన్న జో బైడెన్‌తో కలిసి కమలా హారిస్‌ ఎన్నికల ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇండియన్‌-అమెరికన్‌ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కమలా హారిస్‌ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో అసలైన హీరోల విజయగాథలను చిన్నతనంలో చెన్నైబీచ్‌లో నడుస్తూ..తన తాతగారు చెప్పిన విషయాలను కమలా హారిస్‌ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తన తల్లి శ్యామలా చేసిన ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ గుర్తులను కమలా హారిస్‌ ఈ సందర్భంగా అక్కడివారితో పంచుకున్నారు.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకుంటే హెచ్‌-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని అంతకుముందు జరిగిన ప్రచారకార్యక్రమంలో ఆయన ప్రచారబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని