కొవిడ్‌ టెస్టుల్లో.. అమెరికా టాప్‌, రెండో స్థానంలో భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ముందువరుసలో కొనసాగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. తరువాతి స్థానంలో భారత్‌ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ...

Updated : 22 Jul 2020 15:57 IST

5కోట్ల మందికి పరీక్షలు చేశామన్న ట్రంప్‌
భారత్‌లో కోటి 47లక్షల శాంపిళ్లకు పరీక్ష: ఐసీఎంఆర్‌

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ముందువరుసలో కొనసాగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. తరువాతి స్థానంలో భారత్‌ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5కోట్లకు చేరువయ్యిందని, కోటి 20లక్షలకుపైగా టెస్టులతో భారత్‌ రెండో స్థానంలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ రెండు దేశాలు మాత్రమే భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ సమయంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థ మెల్లగా పుంజుకుంటున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మహమ్మారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నామని.. వైరస్‌ ప్రమాదం పొంచివున్న వారిని వెంటనే గుర్తించి వారిని రక్షించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో వైరస్‌ విషయంలో చైనా తీరుపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

భారత్‌లో కోటిన్నరకు చేరువలో..

కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా భారత్‌లోనూ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం అనివార్యమయ్యింది. ప్రతిరోజు దాదాపు 3లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 3,43,243 శాంపిళ్లకు కొవిడ్ పరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కోటీ 47లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది.

ఇవీ చదవండి..
వ్యాక్సిన్‌ కోసం వేచి చూడొద్దు..డబ్ల్యూహెచ్‌ఓ
కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలోనే 7వ స్థానంలోకి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని