పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం 

నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాల కాల్పులపై భారత్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పు ఘటనపై పాకిస్థాన్‌ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు...........

Published : 15 Nov 2020 03:16 IST

పాక్‌ హైకమిషనర్‌కు సమన్లు

దిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాల కాల్పులపై భారత్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిన్నటి కాల్పుల ఘటనపై పాకిస్థాన్‌ తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీచేసిన విదేశాంగ మంత్రిత్వశాఖ నిరసన తెలిపింది. దీపావళి వేళ ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పౌరులపై దాడులను ఖండించింది. ఎలాంటి కవ్వింపులు లేకుండానే పలు సెక్టార్లలో పాక్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని, మరో 19మంది గాయపడ్డారని మండిపడింది. హింసను పెంచేందుకు యత్నించడం.. ఉగ్రవాదుల చొరబాటుకు మద్దతిస్తున్న పాక్‌ వైఖరిపై నిరసన తెలిపింది.

ఇదీ చదవండి..

పాక్‌ స్థావరాలపై రాకెట్ల వర్షం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని