రఫేల్‌ను నడపనున్న తొలి మహిళా పైలట్! 

భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లోని గోల్డెన్ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ ద్వారా సేవలు అందించనున్న రఫేల్ యుద్ధ విమానాలను ఓ మహిళా పైలట్ నడపనున్నారు.

Updated : 22 Sep 2020 17:06 IST

ఐఏఎఫ్ వర్గాల వెల్లడి

దిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లోని గోల్డెన్ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ ద్వారా సేవలు అందించనున్న రఫేల్ యుద్ధ విమానాలను ఓ మహిళా పైలట్ నడపనున్నారు. అందుకు సంబంధించి ఆమె శిక్షణ పొందుతున్నారని సోమవారం వైమానిక దళ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆమె మిగ్-21 యుద్ధ విమానాలను గాల్లోకి రయ్‌మనిపిస్తున్నారు. ప్రస్తుతం వైమానిక దళంలో మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వారిలో 10 మంది యుద్ధవిమాన పైలట్లు, 18 మంది నావిగేటర్లు ఉన్నారు. మొత్తంగా మహిళా అధికారుల సంఖ్య 1875గా ఉంది. 

ఇదిలా ఉండగా..సెప్టెంబర్‌ 10న హరియాణాలోని అంబాలా స్థావరం వద్ద ఐదు రఫేల్ యుద్ధ విమానాలను భారత ప్రభుత్వం వైమానిక దళంలోని 17వ స్క్వాడ్రన్ గోల్డెన్‌ ఆరోస్‌లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం మొత్తం 36 యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో భారత్‌ రూ.59,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 2021 నాటికి ఆ దేశం మొత్తం యుద్ధవిమానాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేయనుంది. రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన 23 ఏళ్లకు ఈ కొత్త విమానాలను మనదేశం సమకూర్చుకుంది. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని