గాల్లోనే ఇంధనం: రఫేల్ ఫొటోలు చూశారా..

భారత గగనతల రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత వాయుసేన అమ్ముల పొదిలో ఒదిగిపోయేందుకు మరి కొద్ది గంటల్లో రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోనున్న సంగతి...

Published : 28 Jul 2020 18:41 IST

దిల్లీ: భారత గగనతల రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత వాయుసేన అమ్ముల పొదిలో ఒదిగిపోయేందుకు మరి కొద్ది గంటల్లో రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 30 వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. ‘‘భారత్‌కు పయనమైన రఫేల్ విమానాలకు ఫ్రెంచ్‌ ఎయిర్‌ఫోర్స్‌ చేసిన సహాయానికి అభినందనలు’’ అంటూ భారత్ వాయుసేన కామెంట్‌ను జోడించింది. ఫ్రాన్స్‌ వాయుసేనకు చెందిన ఇంధన ట్యాంకర్‌ విమానం నుంచి భారత రఫేల్ యుద్ధ విమానాలు ఇంధనం నింపుకోవడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు.

తొలి దశలో భాగంగా భారత్‌కు ఐదు రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. నిన్న మధ్యాహ్నం ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరి మధ్యలో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌కు (యూఏఈ) చెందిన అల్‌-దాఫ్రా వైమానిక స్థావరం వద్ద ఆగాయి. తిరిగి అక్కడ నుంచి బయల్దేరిన విమానాలు బుధవారం భారత్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరకోనున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన అధునాతన సాంకేతికతను వీటికి అమర్చడంతో భారత రఫేల్ మరింత శక్తివంతంగా రూపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని