అమెరికాలో భూమిపూజ సంబురాలు

అయోధ్యలో బుధవారం జరుగనున్న రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమెరికాలోని..

Published : 04 Aug 2020 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్యలో బుధవారం జరుగనున్న రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమెరికాలోని అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు. కోట్ల మంది ప్రజల విశ్వాసానికి ఈ రామాలయం ప్రతీక అని, అమెరికా అంతటా వర్చువల్‌ ప్రార్థనలు నిర్వహించాలని ఇండో అమెరికన్‌ హిందూ నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగర వీధులతో సహా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద రాముడి చిత్రాలను, మందిర చిత్రాలను పెద్దపెద్ద ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించనున్నారు. శుంకుస్థాపన జరిగే ఆగస్టు 5న న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లోని బాహ్య తెరలపై రాముడి త్రీడీ చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను 17 వేల చదరపు అడుగుల బాహ్య తెరలను లీజుకు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని