శత్రువులపై మానవత్వం.. భారత సైన్యం తత్వం

శత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.

Updated : 26 Mar 2024 12:38 IST

గ్యాంగ్‌టక్‌: కయ్యాలమారి చైనా కాటేసేందుకు కాచుకుని కూర్చొన్నా, దీటైన జవాబిచ్చే సత్తా ఉన్న భారత్‌ మాత్రం ఎంతో సంయమనాన్ని పాటిస్తూ వస్తోంది. గల్వాన్‌ ఘటనలో మన సైనికులను పొట్టన పెట్టుకున్నా.. పొరబాటున భారత భూభాగంలోకి వచ్చిన వారి పౌరుల ప్రాణాలు నిలబెట్టింది. దారితప్పి మన భూబాగంలోకి వచ్చిన చైనాయులను భారత సైన్యం ఆదుకుంది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చైనీయులు దారి తప్పి.. భారతదేశంలోని ఉత్తర సిక్కిం ప్రాంతానికి చేరుకున్నారు. సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో అక్కడి వాతావరణ స్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అల్లాడుతున్న చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆక్సిజన్‌, ఆహారం, వెచ్చని దుస్తులు అందించటమే కాకుండా వారు తిరిగి వెళ్లేందుకు దారి చూపింది.

సెప్టెంబర్‌ 3న చోటుచేసుకున్న ఈ సంఘటనకు గురించిన వివరాలను భారత సైన్యం నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. రాజకీయ, సైనికపరంగా వైషమ్యాల సంగతి ఎలాఉన్నా... శత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని