పర్యాటకుల కోసం సరికొత్త రైల్వే కోచ్‌లు

పర్యాటకుల కోసం కొత్తగా రూపొందించిన విస్టాడోమ్‌ టూరిస్ట్‌ కోచ్‌లను రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. ‘గొప్ప విషయంతో ఈ సంవత్సరాన్ని.......

Published : 30 Dec 2020 20:45 IST

చెన్నై: పర్యాటకుల కోసం కొత్తగా రూపొందించిన విస్టాడోమ్‌ టూరిస్ట్‌ కోచ్‌లను రైల్వే శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. ‘గొప్ప విషయంతో ఈ సంవత్సరాన్ని ముగించనున్నాం. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విస్టాడోమ్‌ టూరిస్ట్‌ కోచ్‌లను భారతీయ రైల్వే కొత్తగా రూపొందించి విజయవంతంగా పరీక్షించింది. వీటిలో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీంతో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకం లభించనుంది’ అని మంత్రి ట్వీట్ చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ కొత్తరకం కోచ్‌లను తయారు చేశారు. వీటిలో ఏర్పాటు చేసిన కిటికీ అద్దాలు చాలా పెద్దగా ఉంటాయి. దీంతో ప్రయాణికులు 360 డిగ్రీల కోణంలో అన్ని ప్రాంతాలను చూసి జర్నీని ఆస్వాదించొచ్చు. వీటిని పర్వత ప్రాంతాల్లో పర్యాటకానికి ఉపయోగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని