రష్యా వ్యాక్సిన్‌పై భారత్‌ చర్చలు

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని...

Published : 16 Aug 2020 00:40 IST

ఫేజ్‌-1, 2 సమాచారం కోరిన ఇండియన్‌ కంపెనీలు

మాస్కో: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని.. కీలకమైన మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఫేజ్‌-1, ఫేజ్-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోరినట్లు ఆ దేశ మీడియా స్పుత్నిక్‌ పేర్కొంది. వ్యాక్సిన్‌ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు  తెలిపింది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో చర్చించినట్లు పేర్కొంది. 

‘‘స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతలూ పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఎగుమతి చేసేందుకు అనుమతి కోరాయి’’ అని స్పుత్నిక్‌ వెల్లడించింది. మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలు ఈ వివరాలు తెలిపినట్లు పేర్కొంది.

మరోవైపు మాస్కోలోని భారత రాయబారి వెంకటేశ్‌ వర్మ ‘స్పుత్నిక్‌-వి’పై ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌తో చర్చించారు. కొవిడ్‌-19 పై వ్యాక్సిన్‌ ఉత్పత్తి విషయంలో పరస్పర సహకారం విషయంలో చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెంకటేశ్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని దిమిత్రియేవ్‌ తెలిపారు.

ఇదీ చదవండి..

వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని