సింగపూర్‌లో భారత సంతతి నర్సుకు గౌరవం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందు వరుసలో ఉండి పోరాడిన నర్సులను సింగపూర్‌ .......

Published : 23 Jul 2020 01:58 IST

కళా నారాయణసామికి  ప్రెసిడెంట్ అవార్డు

సింగపూర్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందు వరుసలో ఉండి పోరాడిన నర్సులను సింగపూర్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. దేశంలో ఐదుగురు నర్సులకు ప్రెసిడెంట్‌ అవార్డులతో సత్కరించింది. వీరిలో భారత సంతతికి చెందిన 59 ఏళ్ల కళా నారాయణసామి ఉన్నట్టు సింగపూర్‌ ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. కళా నారాయణ సామి ఉడ్‌ల్యాండ్స్‌ హెల్త్‌ క్యాంపస్‌లో నర్సింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003లో సార్స్‌ విజృంభణ సమయంలో తాను నేర్చుకున్న ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ ప్రాక్టీసును ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించి సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించింది.

రోగుల సంరక్షణ, విద్య, పరిశోధన, పరిపాలనలో అత్యుత్తమ పని తీరును కనబరిచిన వారికి ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు. 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ఇప్పటివరకు 77 మంది నర్సులు అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద ట్రోఫీతో పాటు అధ్యక్షుడు హలిమా యాకోబ్‌ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, 7228 యూఎస్‌ డాలర్ల మొత్తాన్ని ఇస్తారు. ఈ సందర్భంగా కళా నారాయణ సామి మాట్లాడుతూ.. తర్వాతి తరం నర్సులను తయారుచేయడంపైనే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. నర్సింగ్‌ వృత్తిలో తగిన ప్రతిఫలం తప్పకుండా చేకూరుతుందని తానెప్పుడూ అందరితో చెబుతుండేదాన్నని ఆమె గుర్తుచేసుకున్నారు. సింగపూర్‌లో ఇప్పటివరకు 48,744 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, వీరిలో 44,500 మందికి పైగా కోలుకొని డిశ్చార్జి కాగా.. 27 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు