
మన రఫేల్‌ల సమీపంలో ఇరాన్ క్షిపణులు!
అల్ దాఫ్రా: ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడిని వెల్లడించే అత్యవసర సైరన్ మోగింది. అదే సమయంలో ఖతర్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్, ఫాక్స్ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లో వెల్లడించారు.
డమ్మీ విమాన వాహక నౌకపై దాడులు
ఇరాన్ గత కొన్ని రోజులుగా హర్మూజ్ జలసంధిలో భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దీనికి మహమ్మద్ 14 అని పేరు పెట్టింది. వీటి కోసం ఓ డమ్మీ విమాన వాహక నౌకను నిర్మించింది. విన్యాసాల్లో భాగంగా విమాన వాహక నౌకలపై దాడి తదితర అంశాలను సాధన చేసింది. కొన్ని హెలికాప్టర్లపై నుంచి ఈ నకిలీ విమాన వాహక నౌక పైకి క్షిపణులను ప్రయోగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
India News
Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్పీల మధ్య హోరాహోరీ
-
General News
Telangana News: 19 లక్షల రేషన్‌కార్డుల రద్దుపై దర్యాప్తు చేయండి: ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు
-
Movies News
Cash Promo: ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్
-
Crime News
Hyderabad: బాలికతో పెళ్లి చేయట్లేదని.. డీజిల్ పోసుకొని సజీవదహనం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)