విద్యార్థులకు 10జీబీ డేటా.. నిజమేంటంటే..

దేశంలోని విద్యార్ధులందరికీ ప్రభుత్వం 10 జీబీ ఇంటర్నెట్‌ డేటాను అందించనుందనే వార్తలు వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ..

Published : 07 Oct 2020 18:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని విద్యార్ధులందరికీ ప్రభుత్వం 10 జీబీ ఇంటర్నెట్‌ డేటాను అందించనుందనే వార్తలు వాట్సప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యా సంస్థల్లో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పష్టం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయమేదీ తీసుకోలేదని ఈ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని