రాజీనామా చేయనున్న జపాన్‌ ప్రధాని అబె!

జపాన్‌ ప్రధాని షింజో అబె రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Published : 28 Aug 2020 12:13 IST

అనారోగ్యం కారణంగానేన్న స్థానిక మీడియా

టోక్యో: జపాన్‌ ప్రధాని షింజో అబె రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారని శుక్రవారం స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

ఆరోగ్యం మరింత దిగజారుతుండటంతో రాజీనామా చేయాలని అబె భావిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడం గురించే ఆయన ఆందోళన చెందుతున్నారని అక్కడి జాతీయ మీడియా సంస్థ ఎన్‌ఎచ్‌కే వెల్లడించింది. కాకపోతే ఆ సమాచారాన్ని ధ్రువీకరించలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ గత రెండు వారాలుగా పలు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలియనప్పటికీ, వైద్యం నిమిత్తం రెండు సార్లు ఆసుప్రతికి వెళ్లినట్లు సమాచారం. కాగా, కొద్ది గంటల్లో అబె మీడియా సమావేశంలో మాట్లాడనున్న నేపథ్యంలో..అది కూడా రాజీనామాకు గల కారణాలు వివరించడానికేనని సదరు మీడియా సంస్థ పేర్కొంది. 

షింజో అబె ఈ నెలలో మూడు రోజులు సెలవు తీసుకొని, ఏ ప్రకటన చేయకుండా ఆసుపత్రికి వెళ్లారు. కానీ, రెండోసారి వెళ్లిన సమయంలో మాత్రం తాను ప్రధాని పదవిలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించారు.  అయినప్పటికీ ఆయన రాజీనామాపై ఊహాగానాలకు అడ్డుకట్టపడలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని