లాలూకి బెయిల్‌.. అయినా జైల్లోనే

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. చైబసా ఖజానా కేసులో లాలూకు

Published : 09 Oct 2020 13:22 IST

రాంచీ: పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. చైబసా ఖజానా కేసులో లాలూకు న్యాయస్థానం బెయిలిచ్చింది. రూ. 2లక్షల పూచికత్తుపై దీనిని‌ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశం లేదు. దుమ్కా ఖజానా కేసులో శిక్ష పడినందున ఆయన జైల్లోనే ఉండనున్నారు. 

1990ల్లో లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆయన.. 2017 డిసెంబరు నుంచి జైల్లో ఉన్నారు. అయితే జైల్లో లాలూ తరచూ అనారోగ్యానికి గురవుతుండటం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పెరోల్‌ ఇవ్వాలని ఇటీవల లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ కోరారు. ఇదిలా ఉండగా.. మరికొద్దిరోజుల్లో బిహార్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు లాలూ అందుబాటులో ఉండే అవకాశాలు కన్పించట్లేదు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని