మా కమల విజయం సాధించింది..

తమ ఆడపడచు కమల విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులో పోస్టర్లు వెలవడం గమనార్హం.

Updated : 17 Aug 2020 15:17 IST

తమిళనాట వెలసిన కమలా హారిస్‌ పోస్టర్లు

ఇంటర్నెట్ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్‌. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా బరిలో నిలిచిన కమలకు భారత్‌లో మద్దతు లభిస్తోంది. కమల విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. ‘‘పీవీ గోపాలన్‌ మనుమరాలు విజయం సాధించింది’’ అని తమిళంలో ఉన్న ఈ పోస్టర్‌కు సంబంధించిన చిత్రాలను కమలా హారిస్‌ సమీప బంధువు మీనా హారిస్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

కమల సోదరి మాయ కుమార్తె అయిన మీనా హారిస్‌.. న్యాయవాది, రచయిత్రి కూడా. ఇక కమలా హారిస్‌ తాత పీవీ గోపాలన్‌.. తంజావూరు జిల్లా, పైంగనాడు ప్రాంతానికి చెందినవారు. ఆయన నాటి బ్రిటిష్‌ ఇండియాలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించారు. అనంతరం జాంబియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని