ట్రంప్‌ సార్‌, మీరే కరెక్ట్‌ ... కంగనా రనౌత్‌

సమాజంలో భాగంగా ఉన్న మనం.. ఏది నిజమైన సిగ్గుచేటు పని అనేది గుర్తించాలి.’’ అని కంగన అన్నారు.

Updated : 28 Sep 2020 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తన ప్రత్యర్థి జో బిడెన్‌ను సవాలు చేయటం సరైన చర్య అని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ సమర్ధించారు. తన ప్రత్యర్ధి బిడెన్‌ మాదక ద్రవ్యాలు వాడుతున్నారని.. ఆయన నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ట్రంప్‌ సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లిని అవమానించడం, మానసిక అనారోగ్యాన్ని అపహాస్యం చేయటం వంటి హేయమైన చర్యల కంటే ఈ విధంగా ఆరోపించటమే ఉత్తమమని కంగన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ట్వీట్‌లో ఏముందని కాకుండా.. ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

‘‘ఎప్పుడూ నిద్రపోతున్నట్టుండే జో బిడెన్‌, మంగళవారం రాత్రి జరుగనున్న చర్చకు ముందు లేదా తర్వాత, ఎప్పుడైనా డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఆ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉపన్యాసాలు ఇవ్వటంలో రికార్డు సృష్టించే విధంగా ఉన్న ఆయన ప్రదర్శన, అసహజంగా ఉంది. ఆయనలో ఇంత వ్యత్యాసానికి కేవలం డ్రగ్స్‌ మాత్రమే కారణం కాగలవు.’’ అని తన ట్వీట్‌లో ట్రంప్‌ విమర్శించారు.

కాగా కంగన ట్రంప్‌ ట్వీట్‌ను ఉదహరిస్తూ..  ‘‘ట్వీట్‌లో ఉన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ సందర్భాన్ని నేను మెచ్చుకుంటున్నాను. మత్తు మందులు తీసుకోవడాన్ని అందరూ చెడ్డ విషయంగా భావిస్తారు. కానీ ఓ మాతృమూర్తి పునరుత్పత్తి అవయవాలను, వ్యక్తుల మానసిక అనారోగ్యాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం కన్నా ఇది చెడ్డదేమీ కాదు. సమాజంలో భాగంగా ఉన్న మనం.. ఏది నిజమైన సిగ్గుచేటు పని అనేది గుర్తించాలి.’’ అని ఆమె ఘాటుగా విమర్శించారు.

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి నేపథ్యంలో బాలీవుడ్‌ వ్యక్తుల ప్రమేయంపై ఎన్సీబీ విచారణ చేపట్టిన సంగతి చెందిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్టు కాగా..  దీపికా పదుకొణె, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లను సంస్థ విచారించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని