‘నిజమైన తుక్డే తుక్డే గ్యాంగ్‌ ఎవరంటే?’

రైతుల ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ దీటుగా తిప్పికొట్టింది. తమ విధానాలతో సమాజంలో భయాందోళనలు సృష్టించేవారే.........

Updated : 15 Dec 2020 00:01 IST

భాజపాపై విరుచుకుపడ్డ కపిల్‌ సిబల్‌

దిల్లీ: రైతుల ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్న కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ దీటుగా తిప్పికొట్టింది. తమ విధానాలతో సమాజంలో భయాందోళనలు సృష్టించేవారే నిజమైన ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ విరుచుకుపడ్డారు. ‘‘మిస్టర్‌ మినిస్టర్‌.. నిజమైన తుక్డే తుక్డే గ్యాంగ్‌ ఎవరు? ఎవరైతే ప్రతిపౌరుణ్ని రెండు కోణాల్లో చూస్తారో.. ఎవరైతే సమాజంలో ద్వేషాన్ని ప్రోత్సహిస్తారో... ఎవరైతే గాడ్సేను ప్రశంసిస్తారో.. ఎవరైతే తమ విధానాలతో ప్రజల్ని భయాందోళను గురిచేస్తారో.. వారే నిజమైన తుక్డే గ్యాంగ్. రైతులు కాదు‌’’ అని సిబల్‌ ట్విటర్‌ వేదికగా భాజపాను విమర్శించారు.

గత 19 రోజులుగా దేశ రాజధాని దిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని రైతులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వం వీరితో ఆరు దఫాలు చర్చలు జరిపింది. అయినా, ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో కొంతమంది నేతలు రైతుల్లో అసాంఘిక శక్తులు చేరాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అన్నదాతల ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆదివారం రవశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను గౌరవిస్తుంది. కానీ, అన్నదాతల ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. దీనికే తాజాగా సిబల్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఇవీ చదవండి...

హస్తిన సరిహద్దుల్లో రైతన్నల నిరాహార దీక్ష

గోయల్‌, దన్వె వ్యాఖ్యలపై రగడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని